KTR: అనుమతి నిరాకరించిన పోలీసులు.. కేటీఆర్ సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
KTR: అనుమతి నిరాకరించిన పోలీసులు.. కేటీఆర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కేటీఆర్ మహబూబాబాద్(Mahbubabad) పర్యటన వాయిదా వేసుకున్నారు. అంతేకాదు.. మహ‌బూబాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ధర్నాను పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. మరోవైపు బీఆర్‌‌ఎస్‌‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న ధర్నాకు పర్మిషన్‌‌ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ధర్నాకు దిగారు. కేటీఆర్‌‌ పర్యటనను అడ్డుకుంటామని కొన్ని గిరిజన సంఘాలు ప్రకటించడంతో లా అండ్‌‌ ఆర్డర్‌‌ సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ ధర్నాకు పోలీసులు పర్మిషన్‌‌ ఇవ్వలేదు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్‌‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయ క్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed