- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండియా కూటమిలో చీలికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో చీలికలు ఏర్పడుతున్నాయి. వరుసగా కూటమిలోని మిత్రపక్ష పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి కూడా ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏ కూటమిలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా.. ఈ పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్)లో ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
‘‘ మోసం కాంగ్రెస్ నైజం.. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్ దేశ ప్రజలను ఏం మెప్పిస్తుంది. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు. ఇండియా కూటమికి అంతకన్నా లేదు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక దేశప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే.. తెలంగాణలో కేసీఆర్ అయినా.. బెంగాల్‌లో మమతా అయినా.. పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా ప్రాంతీయ పార్టీల లీడర్లే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.