కేసీఆర్‌ బయటకొచ్చాక ఫస్ట్ మీటింగ్ మీతోనే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
కేసీఆర్‌ బయటకొచ్చాక ఫస్ట్ మీటింగ్ మీతోనే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నొక్కి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌కు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటామని చెప్పారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీలు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఇఫ్పటికే తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టీవ్ చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని కోరారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుంది... అందులో శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed