ఎప్పటికీ అదే శాశ్వతం.. కేసీఆర్ ఇంటర్వ్యూ పై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 12 |
ఎప్పటికీ అదే శాశ్వతం.. కేసీఆర్ ఇంటర్వ్యూ పై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ 12 సంవత్సరాల తర్వాత ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది ఈ డిబెట్‌ను వీక్షించారు. కాగా ఇందులో మాజీ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత మంత్రులు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఇంటర్వ్యూ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆ డిబెట్‌లో కేసీఆర్ మాట్లాడిన తీరును మాస్టర్ ఆఫ్ క్లాస్ గా కేటీఆర్ వర్ణించారు. అలాగే కేసీఆర్ చెప్పిన విధంగా.. ఫామ్ లో ఉండటం తాత్కాలికం కానీ.. క్లాస్ అనేది శాశ్వతం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed