ఇదంతా సీఎం కేసీఆర్ 'పల్లెప్రగతి' వల్లే సాధ్యం : KTR

by samatah |   ( Updated:2022-09-23 08:22:21.0  )
ఇదంతా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి వల్లే సాధ్యం : KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటామని, ప్రశంసలు అందుకుంటామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని అమలుచేస్తున్న పంచాయతీ రాజ్‌‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సహా అధికారులు, 12,769 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను అభినందిస్తూ..మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed