6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-22 12:32:12.0  )
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి ప్రజా సమస్యలపై ట్వి్ట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అవుతూనే ఉన్నారు. అంశాల వారీగా కాంగ్రెస్ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడతున్నారు. తాజాగా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులను క్యూగా పెట్టిన ఫొటో ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అంటూ ఫైర్ అయ్యారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని తెలిపారు. కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్‌ఫర్మర్లు, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నామని తెలిపారు. సాగు నీరు లేక ఎండిన పంటపొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలాల్లో ట్యాంకర్లను చూస్తున్నామని పేర్కొన్నారు.

చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులను చూస్తున్నామని తెలిపారు. రైతుబంధు కోసం నెలల పాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి.. పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇవాళ జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు.. క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం అని తెలిపారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని.. అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని ఫైర్ అయ్యారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని ట్వీట్ చేశారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed