- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: ‘నవ్వి పోదురు నాకేటి సిగ్గు’.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాదయాత్రపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ అదానీకి వ్యతిరేక ర్యాలీని తీయాలనుకుంటున్నాడు. జైపూర్‌లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదోనో.. ఢిల్లీలో అప్పాయింట్మెంట్ దక్కలేదనో.. మొత్తానికి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు మన చిట్టినాయుడు. భాయ్, భాయ్ అని వందల, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి అదానీ వ్యతిరేక రాలీ తీస్తున్నాడంట. నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని.. రేవంత్2ని చూసే రాసుంటారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రాన ప్రజలు తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా?.. లేక మళ్లీ మళ్లీ మోసం చెయ్యచ్చులే అనుకుంటున్నావా? దొంగే దొంగ అనడం నేడు కామన్ అయిపోయింది’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు
— KTR (@KTRBRS) December 18, 2024
అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్!
నేడు అదానీకి వ్యతిరేక ర్యాలీ ని తీయాలనుకుంటున్నాడు!
జైపూర్ లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదోనో! ఢిల్లీ లో అప్పోయింట్మెంట్ దక్కలేదనో!
మొత్తానికి కొత్త…