WTC వేళ టీమిండియా బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

by Gantepaka Srikanth |
WTC వేళ టీమిండియా బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(World Test Championship) వేళ టీమిండియా(TeamIndia)కు భారీ షాక్ తగిలింది. స్టా్ర్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అంతర్జాతీయ టెస్టు క్రికెట్(Test Cricket) వీడ్కోలు పలికారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా బ్రిస్బేన్(Brisban) వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు అనంతరం అశ్విన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కెరియర్‌లో మొత్తం 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 3503 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ ప్రకటనకు ముందు అశ్విన్ భావోద్వేగానికి గురయ్యారు. ప్లేయర్లను హత్తుకొని కన్నీరు పెట్టారు. ఇదిలా ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.




Advertisement

Next Story