నా లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయా.. కానీ ఈ సాంగ్ నేనే పాడాలనిపించింది.. రమణ గోగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
నా లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయా.. కానీ ఈ సాంగ్ నేనే పాడాలనిపించింది.. రమణ గోగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ అంటూ సాగే సాంగ్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఈ పాటను ఆలపించిన సింగర్ రమణ గోగుల ఈ సాంగ్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమణ గోగులను.. గోదారి గట్టు పాట ఆల్రెడీ 27 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది అని యాంకర్ అడుగగా.. దానికి రమణ గోగుల స్పందిస్తూ.. ‘ చాలా గ్రేట్ ఫుల్‌గా ఉంది. నా పాటని అభిమానించే ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మళ్లీ నేనెప్పుడు పాడుతానా అని ఎదురు చూశారు. నేను నా వ్యక్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయిపోయాను. యూఎస్‌లో ఉన్నాను. నేను ఎవరి సంగీతంలో ఇప్పటి వరకు పాడలేదు. కానీ అనిల్, బీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్. ఫెంటాస్టిక్ యాటిట్యూడ్‌తో ఉంటారు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. నా తొలి సినిమా వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’. ఇలాంటి మంచి కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాటని పాడాలని అనుకున్నాను. బీమ్స్ లవ్లీగా కంపోజ్ చేశారు. పాటకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందం ఇచ్చింది. లైఫ్‌ఫుల్ సర్కిల్ అయిందనే ఫీలింగ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed