- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో భూ భారతి బిల్లు.. హరీష్ రావు కీలక రిక్వెస్ట్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి భూ భారతి 2024 బిల్లు(Bhu Bharati Bill)ను ప్రవేశ పెట్టారు. అనంతరం వెంటన్ రూల్స్ సస్పెండ్ చేసి భూ భారతి బిల్లుపై చర్చ ప్రారంభించారు. కాగా ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు(Former minister Harish Rao).. బిల్లుకు సంబంధించిన కాపీలు కూడా అందించకుండా ఎలా చర్చించాలని స్పీకర్ ను ప్రశ్నించారు. అలాగే బీఏసీ మీటింగ్(BAC meeting)లో సభ నిర్వాహన సమయానికి సంబంధించిన వివరాలను అందించలేదని, సభలో ఏ ఏ బిల్లులను ప్రవేశ పెట్టబొతున్నారో ముందస్తుగా తెలపలేదని, కాంగ్రెస్ సభ్యులకు ఇష్టం వచ్చినప్పుడు బిల్లును పెట్టి రూల్స్ ను సస్పెండ్ చేసి.. బిల్లు ప్రవేశ పెట్టిన వెంటనే చర్చించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఈ రోజు సభలో పెట్టిన బిల్లుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని.. తాము కూడా బిల్లును పూర్తిగా చదివి.. తమ వంతు సలహాలు సూచనలు ఇస్తామని ఇందుకు ప్రతి సభ్యునికి సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా హరీష్ రావు స్పీకర్ ను కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఈ బిల్లు వివరాలను మంత్రి వివరించిన తర్వాత.. బ్రేక్ ఇచ్చి.. ఆ తర్వాత బిల్లుపై చర్చిద్దామని స్పీకర్ కు చెప్పుకొచ్చారు.