AP News:త్వరలో ఆ శాఖలో పోస్టుల భర్తీ.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

by Jakkula Mamatha |
AP News:త్వరలో ఆ శాఖలో పోస్టుల భర్తీ.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్(Job Notification) వచ్చే అవకాశముంది. పశుసంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలో నేడు(బుధవారం) పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(Veterinary Assistant surgeon) పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డు(Pashu Kisan Credit Card)లపై 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. ఏపీలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలతో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్దిదారులకు అందించేందుకు నివేదిక పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed