Vignesh: ట్రోలర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నయన్ భర్త.. ఏమన్నారంటే..?

by Anjali |
Vignesh: ట్రోలర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నయన్ భర్త.. ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచే సినీ సెలబ్రిటీల్లో నయనతార(Nayanthara) అండ్ ఈమె భర్త ఒకరు. అయితే తాజాగా నయన్ భర్త విఘ్నేష్ శివన్(Vignesh SivanVignesh Sivan).. పూర్తిగా ఏ విషయం తెలుసుకోకుండా ట్రోల్స్ చేయడం సరైంది కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో అజిత్(Ajith) ‘నానుమ్ రౌడీ దాన్’(Nanum Rowdy Daan) సినిమా బాగుందని చెప్పారని విఘ్నేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలువురు నెటిజన్లు ఈ కామెంట్లపై విమర్శలు గుప్పించారంటూ నయన్ భర్త ఫైర్ అయ్యారు. ఎన్నై అరిందాల్(Ennai Arindal) సినిమా నుంచే హీరో అజిత్ తనకు తెలుసునని అన్నారు.

అంతేకాకుండా ఈ చిత్రం కోసం డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్(Director Gautham Vasudev) సాంగ్ కూడా రాయమన్నారని.. రాసి ఇచ్చానని వెల్లడించారు. ఇక అప్పటి నుంచే ఆయనతో పరిచయం మొదలైందని పేర్కొన్నారు. ఇక నానుమ్ రౌడీ దాన్ మూవీ రిలీజ్ అనంతరం.. విశ్వాసం చిత్ర షూటింగ్‌లో భాగంగా అజిత్‌ను హైదరాబాదు(Hyderabad)లో అనుకోకుండా మీట్ అయ్యానని.. అప్పుడు నానుమ్ రౌడీ దాన్ సినిమా వీక్షించానని అన్నారు. చాలా బాగుందని.. తనకు బాగా నచ్చిందన్నారని వెల్లడించారు. రీసెంట్ ఇంటర్వ్యూలో పూర్తిగా చెప్పే టైం లేదని.. కాగా మొత్తం విషయాన్ని చెప్పలేకపోయానని విఘ్నేష్ వివరించారు. కానీ ఇకనైనా ఈ ట్రోల్స్ ఆపండంటూ విఘ్నేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విఘ్నేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed