- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌ను బోనులో వేసి బంధిస్తానన్న రేవంత్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: దావోస్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం.. కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో అనేక మందిని చూసిందని అన్నారు.
సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించినందుకు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చింనందుకు, ఇచ్చిన హామీలను సమగ్రంగా అమలు చేసినందుకు బీఆర్ఎస్‌ను బొంద పెడుతావా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోతాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రక్తం అంత బీజేపీదే అని అన్నారు.
Read More: లండన్‌లో రెచ్చిపోయిన CM రేవంత్.. కేసీఆర్‌ను చెట్టుకు వేలాడదీస్తానని షాకింగ్ కామెంట్స్