అసెంబ్లీలో ఈటలతో ప్రత్యేకంగా ముచ్చటించిన KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 11:11:06.0  )
అసెంబ్లీలో ఈటలతో ప్రత్యేకంగా ముచ్చటించిన KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శుక్రవారం మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హాజరైన ప్రతిపక్షాలు, అధికార పార్టీ నేతలు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ వద్దకు వెళ్లి మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈటల పిలిస్తే కదా హాజరైయ్యేదని సమాధానం ఇచ్చారు. కాగా కేటీఆర్, ఈటల సంభాషణ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలువడం లేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు.

ఇవి కూడా చదవండి: గవర్నర్ ప్రసంగం.. ఈటల రియాక్షన్ ఇదే!

Advertisement

Next Story