- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
చరిత్ర రిపీట్ అవుతుందని KTR ట్వీట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నెటిజన్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. రోజుల వ్యవధిలో ఎవరూ ఊహించిన ఇద్దరు కీలక నేతలు గులాబీ పార్టీని వీడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌లు కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే వరుస పార్టీ ఫిరాయింపులపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. 2004-06 సమయంలో ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పిరాయింపులు చేసిందని.. కానీ ప్రజల పోరాటాలకు తల వంచిందన్నారు. హిస్టరీ మళ్లీ రిపీట్ అవడం పక్కా అని చెప్పారు.
ఇదే ట్వీట్‌కు ఓ నెటిజన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. చేసిన పాపాలు అనుభవించతప్పదు.. అప్పుడు మీ టైం.. ఇప్పుడు వాళ్లది అని కేటీఆర్ ట్వీట్ కరెక్ట్డ్ అంటూ ఓ ఫొటో కామెంట్‌కు జత చేశారు. 2014-23లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డామని.. తెలంగాణ ప్రజల పోరాటానికి బీఆర్ఎస్ తల వంచిందంటూ తెలిపాడు. హిస్టరీ రిపీట్ అయిందని తెలిపాడు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారా కదా అంటూ ఫైర్ అయ్యాడు.