- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జులై 1న బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో మంగళవారం బెయిల్ వస్తుందో లేదో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇటీవల కవిత స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వైద్యులు సూచించినట్టు ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు జైలు అధికారులు. అప్పుడప్పుడు జైలులో వైద్యులతో చికిత్స సైతం అందిస్తున్నారు. కాగా, మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత ఐదు నెలలుగా ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు.