KTR: అది అనుముల ఇంటెలిజెన్స్.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్

by Ramesh Goud |
KTR: అది అనుముల ఇంటెలిజెన్స్.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటివరకు 40 శాతం రుణాలు కూడా మాఫీ కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 40 లక్షల రైతుల రుణాలు చెప్పినట్టే మాఫీ చేశామని కాంగ్రెస్ చేసిన ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీనిపై ఆయన.. మీరు రూపొందించిన ఏఐ చిత్రం వలె, మీరు పేర్కొన్న సంఖ్య కూడా ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 22 లక్షల రైతు రుణాలు మొత్తంగా 40% లోపు కూడా మాఫీ కాలేదని, ఇందులో నియమాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయని, తేదీలు మారుతూనే ఉంటాయని ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం మరియు నియోజకవర్గంలో కూడా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రమే స్థిరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story