- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్.. నిరసనలకు పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా వ్యతిరేకించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిపైన వెంటనే ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దగ్ధంతో పాటు ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని కేసీఆర్ భరోసా పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఇందుకు సంబంధించి కేసీఆర్ భరోసా పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.