KTR: నేడు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

by Shiva |   ( Updated:2024-09-16 12:22:45.0  )
KTR: నేడు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఓ వైపు ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ పొలిటికల్ వార్‌కు దారి తీసింది. ఈ క్రమంలోనే తాజాగా సెక్రటేరియట్ (Secretariat) ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajeev Gandhi) విగ్రహ ఏర్పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నేడు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదగా మరికొద్దిసేపట్లోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం మొదలు కానుంది. అయితే, తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన చోట ఎలా రాజీవ్ విగ్రహాన్ని పెడతారని బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందించారు.

‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడుతారా? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ అమర జ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెర తీస్తారా? నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన ‘తెలంగాణ తల్లి’ (Telangana Thalli) విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా.. కాంగ్రెస్‌ను తెలంగాణ క్షమించదు.. జై తెలంగాణ (Jai Telangana) ! అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.

కాగా, మరోవైపు రాజీవ్ విగ్రహంపై ఎవరైనా చేయి వేస్తే వీపు చింతపడు చేస్తామని ఓ బహిరంగ సభలో ఇటీవలే సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్. స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన సోనియా గాంధీ (Sonia Gandhi) రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు. భారత ప్రధానిగా సేవలందించిన మహా నాయకుడి విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ప్రతిష్టించడం పట్ల తెలంగాణ జాతి గర్విస్తుందని గులాబీ నేతలను సీఎం కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed