- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: ‘అంతా రేవంత్ సర్కార్ పుణ్యమే’.. కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతల దెబ్బకి హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాలు 40 శాతానికి పైగా పడిపోయాయని, ఇదంతా రేవంత్ రెడ్డి చేతకాని ప్రభుత్వం వల్లేనని ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ఒకప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్న మెట్రోపాలిటన్ సిటీలా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు సమస్యల సిటీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం ఎక్స్ వేదికగా ప్రాప్ ఈక్విటీ లాంటి కొన్ని నివేదికలను షేర్ చేసిన కేటీఆర్.. వాటి ఆధారంగా ‘‘ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు దాదాపు 42 శాతం పడిపోయాయి. అభివృద్ధి చెందుతున్న మహానగరం సంక్షోభంలోకి వెళ్తుందనడానికి ఈ నివేదికలే నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన పుణ్యమే ఇదంతా. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయింది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహానగరం నేడు గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయింది’’ అంటూ కేటీఆర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
KTR Tweet : https://x.com/KTRBRS/status/1838785265768206555