- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ పుకార్లు.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై అష్టకష్టాలు పడుతోంది. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గెలవలేని స్థితికి చేరుకుంది. ఓ వైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, మరోవైపు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్లు వేయడం ఆ పార్టీకి ఊపిరి సలపకుండా చేస్తోంది. తాజాగా, సోషల్ మీడియా వేదికగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందంటూ వార్తలు ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్‌ను ఆపాలంటే ఓ జాతీయ పార్టీ సహకారం అవసరం అని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిణామంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఏదో తెలియని ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీటర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘24 ఏళ్లుగా అఖుంటిత దీక్షతో వందలాది మంది విధ్వంసకారులు, తెలంగాణ వ్యతిరేక శక్తులతో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. మేం చాలా విజయాలు సాధించాం. అలుపెరగని పోరాటం చేసి, ప్రగతికి, గర్వ కారణంగా నిలిచిన రాష్ట్రాన్ని సాధించి నిర్మించుకున్నాం. రాష్ట్ర గుర్తింపు, అభివృద్ధి కోసం మాతో పాటు లక్షలాది హృదయాలు కలిసి కొట్టుకున్నాయి. రహస్య ఎజెండాతో, నిరాధారమైన పుకార్లతో మా పార్టీపై బుదరజల్లే వారికి ఇదే చివరి హెచ్చరిక. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేస్తే.. బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకుంటాం. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తూనే ఉంటుంది. పడిపోతాం, లేస్తాం, పోరాడేది తెలంగాణ కోసమే.. మేము ఎన్నటికీ తలవంచం. జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.