- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : ఆశా వర్కర్లు తల్లుల్లా కనిపించడం లేదా ? ఎక్స్‌లో సీఎంపై కేటీఆర్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటి దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆశా వర్కర్ల ఆందోళనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా? మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా? హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్ళంటే అంత చులకనా? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు.. అంటూ ఫైర్ అయ్యారు.
మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరని డిమాండ్ చేశారు.