KTR: కొన్నది పిసరంత కోతలు కొండంత! సన్న వడ్ల బోనస్‌పై మరోసారి స్పందించిన కేటీఆర్

by Ramesh N |
KTR: కొన్నది పిసరంత కోతలు కొండంత! సన్న వడ్ల బోనస్‌పై మరోసారి స్పందించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వడ్ల కొనుగోలు, సన్న వడ్ల బోనస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి (TS CM) ని విమర్శించారు. పండిన పంట ఎంత ? కొన్న ధాన్యం ఎంత? అని ప్రశ్నించారు. అందులో (Paddy Grains Bonus) బోనస్ రూ.500 ఇచ్చింది ఎంత ధాన్యానికి ? అని నిలదీశారు.

‘1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు నీవే చెబుతున్నావు.. ఇదే నిజం అనుకున్నా ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ రూ.25.98 కోట్లు, రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతన్నలకు కోటి 50 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు ఎగ్గొట్టిన మొత్తం ఎంత ? కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎగ్గొట్టిన మొత్తం ఎంత ? రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఎగ్గొట్టిన మొత్తం ఎంత ?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కొన్నది పిసరంత కోతలు కొండంత.. పండగలాంటి వ్యవసాయం ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగగా మారిందని విమర్శలు చేశారు.

Advertisement

Next Story