- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్విట్టర్ వీడియోపై స్పందించిన కేటీఆర్.. త్వరలో ముషంపల్లి పర్యటన

X
దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ రైతు భావోద్వేగమైన వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ వీడియో తన హృదయాన్ని కదిలించిందని, తానును త్వరలోనే ముషంపల్లి గ్రామాన్ని సందర్శిస్తానని, ఆ ఊరిలో మల్లయ్య గారిని, బోర్ వెల్ రాంరెడ్డి గారిని వ్యక్తిగతంగా కలుస్తానని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. కాగా నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య రైతుల సమస్యలపై ఆవేధన వ్యక్తం చేస్తూ.. వీడియో రికార్డు చేసి కేసీఆర్ గారికి పంపాలని కోరాడు. ఆ రైతు ఆవేదనని వీడియో తీసిన ఓ యువకుడు ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారడంతో ఆ వీడియోని కొందరు నెటిజన్లు కేటీఆర్ ని ట్యాగ్ చేసి షేర్ చేశారు.
Next Story