KTR: మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతోంది.. మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Shiva |
KTR: మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతోంది.. మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సమగ్ర సర్వే నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ (BRS), అధికార కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరసనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ (Telangana) తిరగబడుతోంది.. తెలంగాణ తల్లడిల్లుతోందని అన్నారు. కుటుంబ దాహం కోసం తమ ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల (Lagacharla) లాగయించి ఎదురొడ్డుతోందని కామెంట్ చేశారు.

మా భూములు మాకేనని కొడంగల్ (Kodangal) కొట్లాడుతోందని అన్నారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ (Telangana) ఆగమైతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం‌తో నా తెలంగాణ గరమైతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడుక్కెతున్నారని ఆరోపించారు. ‘హైడ్రా’ (HYDRA) దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు సిద్ధం అవుతున్నారని అన్నారు. మూసీ(Musi) పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారని ఫైర్ అయ్యారు.

పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన బాటపట్టారని గుర్తు చేశారు. ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారంతో రగిలిపోతున్నారని తెలిపారు. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం భగ్గుమంటోందని అన్నారు. కులగణన (Cast Census)లో అడుగుతోన్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొందని.. గురుకులాల్లో సమస్యల పరిష్కారానికి విద్యార్థులంతా ఏకమై రోడ్లపై బైఠాయిస్తున్నారంటూ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.

Advertisement

Next Story