దానం నాగేందర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రాహుల్ గాంధీకి కేటీఆర్ కీలక రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
దానం నాగేందర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రాహుల్ గాంధీకి కేటీఆర్ కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఖండించారు. కంగనాను కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు. గతంలో సోనియా గాంధీపై అసోం ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే కేసీఆర్ ఖండించారని గుర్తుచేశారు. మహిళల పట్ల అగౌరవంగా చేసే వ్యాఖ్యలను పార్టీలు సమర్థించకూడదని సూచించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని హితవు పలికారు. మహిళల పట్ల గౌరవంగా ఉండేలా విలువలు పెంపొందించాలని అన్నారు. నేతల ప్రసంగాల్లో నైతిక ప్రమాణాలు కొనసాగించాలని సూచించారు. అంతేకాదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. జాబ్ క్యాలెండర్, రైతుభరోసా వంటి అనేక హామీలు గాలికొదిలేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed