ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటంపై KTR ఆందోళన

by Gantepaka Srikanth |
ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటంపై KTR ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమ‌తులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను మంగళవారం ట్వీట్ చేశారు. 2022-23 సంవ‌త్స‌రంలో తెలంగాణ‌ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమ‌తులు ఉంటే 2023-24 కాలానికి 26,948 కోట్ల ఎగుమతులే జరిగాయని అన్నారు. ఇక ఐటీ ఎంప్లాయిమ్మెంట్ కల్పన కూడా భారీగా పడిపోయింది. 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే... 2023-24 లో కేవ‌లం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ సంస్థలు మరిన్ని పెరగాలంటే ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను పెంచుతూనే లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.

మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం

స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు.జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయన్నారు. 9 నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోందని ,ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండాగతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story