కేటీఆర్ లో ఆంధ్ర సంస్కృతి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

by M.Rajitha |
కేటీఆర్ లో ఆంధ్ర సంస్కృతి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ ఆంధ్ర సంస్కృతికి అలవాటు పడ్డాడని, అందుకే రికార్డింగ్ డ్యాన్సులు అనే పదం వాడారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఫాంహౌస్ లో కూర్చొని, కొత్త వేషంలో ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్లాన్ లను హరీష్ రావు, కేటీఆర్ లతో అమలు చేయించేలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ఏ మంచి పనిచేసినా, బరితెగించి విషం చిమ్ముతున్నారన్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు అర్ధం అవుతుందన్నారు. కాంగ్రెస్ ఏర్పడిన 8 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పదే పదే కాంగ్రెస్ పై విషం చల్లుతున్న హరీష్​, కేటీఆర్ లతో పాటు కవితకూ అపరిచితుడు సినిమాలోని శిక్షలు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుతిన్నుందుకు శిక్ష అనుభవించాల్సిందేనని వెల్లడించారు. దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు లు సిరిసిల్ల,సిద్దిపేటలో కాకుండా బయటకు వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి అన్ని అవినీతి ప్రాజెక్టులు కట్టారన్నారు. రేవంత్ రెడ్డి సోదరులు పాలన చేస్తున్నారు అనడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ఆయన తన సోదరులకు రాజ్యసభ ఇచ్చాడా? కాంట్రాక్టులు ఇచ్చారా? ఏం చేశారు? అని ప్రశ్నించారు. హరీష్ రావు ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోవాలి అని ప్రతీ రోజు హంగామా చేస్తున్నారన్నారు. తప్పులు దిద్దుకుంటే ప్రజల మదిలో కొంత స్థానం మిగులుతుందని, లేకుంటే దొంగల్లాగ చరిత్రిలో మిగిలిపోతారని మండిపడ్డారు.

Next Story

Most Viewed