- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR : నా మీద కోపంతో రైతులపై చూపిస్తున్నారు : కేటీఆర్

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ(BRS Working President KTR)ర్ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై మరోసారి విరుచుకు పడ్డారు. తన మీద కక్షతో ఆ కోపాన్ని రైతుల మీద చూపిస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సిరిసిల్ల(Siricilla)లోని జిల్లెల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి(Abbadi Rajireddy) ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. తన నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా తాను ముందుండి కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. నా మీద కోపంతో, తమ పార్టీ మీద కక్షతో సిరిసిల్ల కలెక్టర్(Siricilla Collector) అన్యాయంగా, అందునా అనారోగ్యంతో ఉన్న పేద రైతును అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నపుడు కేసీఆర్(KCR) కూడా ఇలాగే కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి అనుకుంటే వీళ్ళంతా ఎక్కడ ఉండేవారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకొని పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా ఒకే ఇంటిపేరు ఉండటం వలన అబ్బాడి అనిల్ అనే బీఆర్ఎస్ నాయకునికి బదులు, అబ్బాడి రాజిరెడ్డి అనే రైతును అరెస్ట్ చేశారని విమర్శలు ఎదురయ్యాయి.