KTR: అధికారం పోయిందని ఎవరూ దిగలు పడొద్దు: కార్యకర్తలకు కేటీఆర్ కీలక పిలుపు

by Shiva |
KTR: అధికారం పోయిందని ఎవరూ దిగలు పడొద్దు: కార్యకర్తలకు కేటీఆర్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారం పోయిందిని ఎవరూ దిగులు పడొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన సిరిసిల్లలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాస్త విరామం కోసమే మన కారు గ్యారేజీకి వెళ్లిందని, తిరిగి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుదామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన చూశాక, కేసీఆర్ విలువేంటో ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుందని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆ హామీల అమలకు ప్రభుత్వం నీళ్లు నములుతోందంటూ ఎద్దేవా చేశారు. కేవలం మతం పేరుతో ఓట్లు అడగటం తప్ప.. బండి సంజయ్ ప్రజలకుKTR: అధికారం పోయిందని ఎవరూ దిగలు పడొద్దు: కార్యకర్తలకు కేటీఆర్ కీలక పిలుపు చేసిందేమి లేదని అన్నారు.

Next Story

Most Viewed