- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చొద్దు: అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కోట్లాడి సాధించిన తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చొద్దని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు సివిల్ లా బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై చర్చను ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైబర్ క్రైమ్‌లు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా రేప్ కేసుల్లో నిందితులకు త్వరాగా శిక్షలు పడేందుకు ఎక్కువ సంఖ్యలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్రం కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చిందని, ఆ చట్టాలతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ముందు కొత్త చట్టాలపై ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేయాలని ప్రశ్నించారు. ప్రజల భావ స్వేచ్ఛకు అంటంకం కలుగకుండా చూడాలన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చొద్దని ప్రభుత్వాన్ని కేటీఆర్ అన్నారు.