- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘కేటీఆర్ కు అర్బన్ కు రూరల్ కు తేడా తెలియదు’

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇంకా తేరుకోవడం లేదు. హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలపై గులాబీ నేతల్లో రకరకాల చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ ఈ దుస్థితికి రావడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణం అంటూ బీఆర్ఎస్ మద్దతుదారులే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో దుమారంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అంతా ఆన్ లైన్ కాల్ లో సమావేశం కాగా ఈ మీటింగ్ కు సంబంధించిన వీడియోలు లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో పార్టీ దిగజారిపోవడానికి కేటీఆర్ ఆయన పీఆర్ స్టంట్సే కారణం అంటూ ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రత్యర్థులు షేర్ చేస్తున్నారు.
అర్బన్ కు రూరల్ కు తేడా తెలియదు:
కేటీఆర్ కు అర్బన్ కు రూరల్ కు తేడా తెలియదని, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ జీడీపీ గురించి మాట్లాడితే వారికి ఏం అర్థం అవుతుందని మండిపడ్డారు. హరీశ్ రావును మెదక్ వరకే కట్టడి చేశారని, కేటీఆర్ పీఆర్ స్టంట్ వేసి కాలం కేటీఆర్ గడుపుతున్నాడని, కేసీఆర్ మాదిరిగా రాజకీయం చేయడం కేటీఆర్, కవితలు రాదని వీరిద్దరు తండ్రిపేరు చెప్పుకుని పాలిటిక్స్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ తీరు వల్ల కిందిస్థాయి కార్యకర్తలు డీమోటివేట్ అవుతున్నారని కేటీఆర్ కు చేతనైతే రాజకీయం చేయాలని లేకుంటే మానుకోవాలంటూ హితవుపలికారు. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో కేటీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని నిజానికి కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరినే పార్టీని నిండా ముంచిందని ధ్వజమెత్తారు.
ప్రత్యర్థులకు ఆయుధం:
బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆరే అనే ప్రచారం జరుగుతున్న వేళ సొంత పార్టీ మద్దతుదారులే కేటీఆర్ వైఖరిపై విరుచుకుపడుతుంటడం ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. కాగా కేటీఆర్ కు ఇటీవల ఏది చేసిన అది రివర్స్ అవుతోంది. నిన్న 'కనకపు సింహాసనంపై' అనే పద్యాన్ని కేటీఆర్ పోస్ట్ చేయగా దానిపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు మీరే అధికారంలో ఉన్నారని మీ పనులు నచ్చకే ప్రజలు తిరస్కరించారంటూ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు పబ్లిసిటీకి ఉపయోగపడిన సోషల్ మీడియా వారియర్స్ తాజాగా కేటీఆర్ పై ఆగ్రహంతో రగిలిపోవడం చర్చనీయాశం అయింది. కేటీఆర్ విషయంలో ఈ వరుస పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది.