- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR : ఆశాలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్ డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఆశా వర్కర్లు (Asha workers) నిన్న శాంతియుత ప్రొటెస్ట్ చేస్తే వారిపై దాడి (Police attacked) చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తను పరామర్శించి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లో పని చేశారని గుర్తుకుచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగారని అన్నారు. ఏసీపీ ఇగో దెబ్బతిన్నదో ఏంటో తెలియదని, నిన్న ఆశాల నిరసనలో మగ పోలీసులు మహిళలను కొట్టారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా? హోమ్ శాఖ సీఎం చేతిలోనే ఉందన్నారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని నిలదీశారు.
నిన్న జరిగింది దుశ్శాసన పర్వమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫైర్ అయ్యారు. ఆశాలపై దాడి విషయంలో ఈ పోలీసుల చర్యను వదిలిపెట్టమని హెచ్చరించారు. మహిళా కమిషన్‌ను కలిసి పిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని. అవసరం అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలుస్తామని చెప్పారు. ఆశాలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో కొట్లడుతామన్నారు. అదేవిధంగా గాయపడి (Asha workers) ఆశా వర్కర్లకు ఇక్కడ వైద్యం అందకపోతే మా (BRS) పార్టీ అండగా ఉండి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేపిస్తామని భరోసా ఇచ్చారు.
Also Read...