KTR: ఈ సమయంలో రాహుల్ వియాత్నం టూరా?: కేటీఆర్

by Prasad Jukanti |   ( Updated:31 Dec 2024 6:33 AM  )
KTR: ఈ సమయంలో రాహుల్ వియాత్నం టూరా?: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ టాప్ లీడర్ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం మొత్తం విషాదంలో ఉందని ఈ సమయంలో రాహుల్ గాంధీ వియాత్నం పర్యటన ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు. మంగళవారం ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. దేశం కోసం సర్వస్వం ధారపోసిన నేతలను అవమానించే డీఎన్ఏ కాంగ్రెస్ లోనే ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే మహనీయులను అవమానపరచడం అన్నారు. పీవీకి కాంగ్రెస్ చేసిన అవమానాన్ని ప్రజలు మరిచిపోరన్నారు.



Next Story