- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టులు చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు కనిపిస్తున్నాయని, బీఆర్ఎస్ నేతలంటే సీఎంకు ఎందుకంత భయమని అన్నారు. తమ పార్టీ నేతల అరెస్ట్ సిగ్గుచేటని, కాంగ్రెస్ పార్టీ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గుర్తిస్తోందని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంలో గురువారం నుంచి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం నుంచి అరికెపూడి ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ శ్రేణులను ఉదయం నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి వంటి కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే కార్యకర్తలను తరలించేందుకు డీసీఎంలు సైతం సిద్ధం చేసుకున్నారు.