రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది KCR బస్సు యాత్ర.. KTR సంచలన వ్యాఖ్యలు

by Anjali |
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది KCR బస్సు యాత్ర.. KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాన్ని ఒక మలుపు తిప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 17 రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితిని కేసీఆర్ బస్సు యాత్ర తీసుకు వచ్చిందని చెప్పారు. ఏ జిల్లాకి పోయినా, ఏ నియాజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే కేసీఆర్ కాలు పెట్టారో అక్కడ ప్రజలందరూ కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి.. ప్రజలు తమ బాధలు వెల్లబుచ్చుకున్నరన్నారు.

అలాగే బస్సు యాత్రను, రోడ్ షోలను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాక ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనిపిస్తుందన్నారు. తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించామని వెల్లడించారు. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో ఒక స్పష్టమైన విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం కనిపించిందన్నారు. ముఖ్యంగా కేసీఆర్ పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు.

Advertisement

Next Story