- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి KTR సవాల్
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్వామిజీలతో సంబంధం లేదన్న వారు.. కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబురాలు చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిందితులతో సంబంధం లేదన్న వారే.. దొంగలను భుజాలపై మోస్తున్నారని బీజేపీ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వారి జేబు సంస్థ అయిన సీబీఐకి బదిలీ అయినందున కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సంబురమా అని ప్రశ్నించారు. ఈ కేసు తదుపరి విచారణను సీబీఐకి అప్పగిస్తే.. బీజేపీ సంబురాలు చేసుకోవడం వెనుక మర్మమేంటి అని నిలదీశారు. కలుగుల్లో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటికొస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అసలు దొంగలు ముసుగులు తొలిగాయని అన్నారు. ఈ కేసులో నిందితులకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.