- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ కేటీఆర్ వరుస విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTRBRS) ట్విట్టర్(Twitter)లో ఎల్లప్పుడూ యాక్టివ్ ఉంటూ.. ప్రభుత్వం(Congress Govt)పై విమర్శల(Criticisms) వర్షం కురిపిస్తుంటారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లో ఎండగడుతూ.. కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా వరుస ట్వీట్ లు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పుట్టిన రోజు శుభాకాంక్షలు(Borthday Wishes) చెబుతూనే.. సంచలన సవాల్(Challenge) విసిరారు. హ్యాపీ బర్త్‌డే రేవంత్ రెడ్డి అంటూనే.. ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా చాయ్, బిస్కెట్లతో స్వాగతిస్తానని అన్నారు.
అలాగే నా అరెస్ట్ కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డికి మెఘా కృష్టారెడ్డి(Mega Krishna Reddy)ని అరెస్ట్(Arrest) చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. అంతేగాక ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’(Andhra Contractor)ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’(East India Company)ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్(Kodangal Lift Irrigation) నుండి తీసివేయడానికి దమ్ముందా.. లేదా? అని ప్రశ్నించారు. ఇక మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్(BRS Leaders Arrest) చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుందని, ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే నిర్బంధంలోకి తీసుకున్న మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.