KTR: గ్యారంటీల పాతర.. అబద్ధాల జాతర: కేటీఆర్ హాట్ కామెంట్స్

by Shiva |
KTR: గ్యారంటీల పాతర.. అబద్ధాల జాతర: కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో ఆరు గ్యారంటీ (Six Guarantees)లను ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పి తాజా బడ్జెట్‌లో మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government) బడ్జెట్‌ సాక్షిగా ఆటో డ్రైవర్ల నుంచి అన్నదాతల దాకా అన్ని వర్గాల వారిని దగా చేసిందని అన్నారు.

ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏమోగానీ ట్రిలియన్‌ డాలర్ల అప్పులు తేవడం ఖాయంగా కనిపిస్తుందని సెటైర్లు వేశారు. నమ్మి ఓటేసిన పాపానికి పింఛన్లు పెంచకుండా వృద్ధులను, దివ్యాంగులను, నెలకు రూ.2,500 ఇవ్వకుండా ఆడబిడ్డలను, స్కూటీలు ఇవ్వకుండా విద్యార్థినులను దగా చేశారని మండిపడ్డారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, ఆత్మీయ భరోసా ఇవ్వకుండా వ్యవసాయ కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్లను ఇవ్వకుండా గౌడన్నలను, రెండో విడత గొర్రెపిల్లలు ఇవ్వకుండా గొల్ల కుర్మలను, రూ.12 లక్షల దళితబంధు ఇవ్వకుండా దళితులను ఇలా కోట్లాది మందిని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) నట్టేట ముంచిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్‌ అంటే కరోనా (Corona) కంటే డేంజర్‌ అనే విషయం ప్రజలకు అర్థమైంది.. అంటూ కేటీఆర్ (KTR) చేసి ట్విట్ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌‌గా మారింది.

Next Story

Most Viewed