కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం

by GSrikanth |   ( Updated:2023-02-03 10:12:56.0  )
కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా నీటి పంపకాల విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కీలక మలుపు తీసుకుంది. ట్రిబ్యునల్ ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై గతంలో కేంద్రం ఏజీ అభిప్రాయం కోరింది. అయితే గతంలో ఏపీ తరపున కేసుల్లో హాజరైనందున తన అభిప్రాయాన్ని ఇవ్వలేనని ఏజీ స్పష్టం చేశారు. దీంతో అభిప్రాయం కోసం ఫైన్‌ను కేంద్రం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంపించింది. తుషార్ మెహతా అభిప్రాయం తర్వాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆ తర్వాతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలంటూ తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం ఓ షరతు పెట్టింది. సుప్రీంకోర్టులో తెలంగాణ పిటీషన్ విత్ డ్రా చేసుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరగా అందుకు నిరాకరించడంతో కేంద్రం సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరుతోంది.

Advertisement

Next Story

Most Viewed