- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Korutla: మెడిటేషన్ చేయండి.. ఎమ్మెల్యే సంజయ్‌కు కాంగ్రెస్ నేత కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల సంజయ్(Kalvakuntla Sanjay).. రాష్ట్ర ప్రజలు మీకు తాగుబోతుల్లా కనబడుతున్నారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు(Juvvadi Krishnarao) మండిపడ్డారు. కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఓ మహిళా రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత(Congress Leader).. సోషల్ మీడియా(Social Media) వేదికగా కౌంటర్(Counter) ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు(Telangana People) తాగుబోతుల్లా కనబడుతున్నారా? కోరుట్ల ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు. మీకు.. మీ కేటీఆర్(KTR) కి ఇళ్ళలో కుటుంబ సభ్యులతో కూర్చుని తాగే సంస్కృతి ఉందేమో? దానిని తెలంగాణ సమాజానికి అంట గట్టొద్దని వ్యాఖ్యానించారు. అంతేగాక ఓ మహిళ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి క్షమాపణలు చెబుతున్నాడని, సంజయ్ ఎప్పుడు ఏమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని మెట్‌పల్లికి చెందిన ఒక డాక్టర్ చెప్పారని, మాట్లాడే ముందు మెడిటేషన్ చేస్కుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ శాంతంగా ఉండాలని కోరుట్ల ప్రజలు(Korutla People) కోరుకుంటున్నారని, మిమ్మల్ని గెలిపించిన కోరుట్ల నియోజకవర్గ ప్రజల పరువు తీయ్యవద్దని అన్నారు.