పొంగులేటిపై కూనంనేని ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-21 06:11:52.0  )
పొంగులేటిపై కూనంనేని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్ అయ్యారు. పొంగులేటి డబ్బులతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పడం దుర్మార్గమన్నారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలవాలన్నారు. ప్రతి ఒక్కరిని కొనుగోలు చేసే విధంగా పొంగులేటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇటీవల పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story