- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడుగా కొండ వీరశేఖర్ గుప్తా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం ఎన్నికల ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం, వైశ్య భవన్, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, చిట్టి మిల్ల హరిప్రసాద్ జూనియర్ కళాశాల, మాణిక్ భవన్ల్ స్కూల్ కార్యవర్గాల ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో 2400 ఓట్లు గల్లంతు, బ్యాలెట్ పేపర్ బయటకు రావడం లాంటి సంఘటనలతో ఎన్నికలు రంజుగా జరిగాయి.
సోమవారం నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజిలోగల ఆర్యవైశ్య సంఘ భవనంలో ఎన్నికల ఫలితాలు వెలువరించారు. నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘ అధ్యక్షుడిగా కొండ వీర శెఖర్ గుప్తాకు మొత్తం 1785 ఓట్లు రాగా 1050 ఓట్ల తేడాతో ప్రత్యర్థి పై విజయం సాధించారు. విజయం సాధించిన సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘ భవనంలో సంబురాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు.
మాణిక్ భవన్ సంఘ అధ్యక్షుడిగా ధన్‌పాల్ శ్రీనివాస్ గుప్తా
శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్) (చిట్టి మిల్ల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల) నూతన అధ్యక్షుడుగా ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా ఎన్నికయ్యారు. శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్) (చిట్టి మిల్ల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల) సంఘ అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా మొత్తం 2002 ఓట్లు రాగా ప్రత్యర్థి పై1247 ఓట్ల తేడాతో విజయం సాధిం చారు.
ఈ సందర్భంగా ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ భారీ మెజారిటీతో నిజామాబాద్ నగర ఆర్యవైశ్యులు నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘ సభ్యులను అందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు.
వైశ్య భవన్ కమిటీ అధ్యక్షుడిగా చందూరు ధర్మేందర్ గుప్తా మొత్తం 1564 ఓట్లు రాగా 400 పై ఓట్లుచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్య వైశ్య పట్టణ పట్టభద్రుల సంఘం(ఆవోగా) అధ్యక్షుడిగా కూకుట్ల నవీన్ కుమార్ గుప్తా విజయం సాధించారు.