- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భువనగిరి ఎంపీ టికెట్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానానిదే ఫైనల్ డిసిషన్ అనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలవబోతున్నదని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని తప్పిదాల వల్లే 64 ఎమ్మెల్యేలు గెలిచారని ఇంకాస్త మెరుగ్గా పని చేసి ఉంటే 80 ఎమ్మెల్యేలు గెలిచేవారన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈసారి గెలిచే వారికే టికెట్లు ఇవ్వబోతున్నారని అలాంటి వారికే టికెట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక బాగుందని భువనగిరితో పాటు పెండింగ్ లో ఉన్న మిగతా స్థానాల్లో సీనియర్లతో పాటు రాజకీయంగా స్టేచర్ ఉన్న వారికి టికెట్లు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తమ కుటుంబంలో తాను ఎమ్మెల్యేగా తన అన్న మంత్రిగా ఉన్నారని, మా కుటుంబానికి మరో అవకాశం ఇవ్వాలని కోరడం లేదన్నారు. ఒక వేళ పార్టీ సర్వే ప్రకారం తన భార్యకు టికెట్ ఇవ్వాలని భావిస్తే పోటీ చేస్తామన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం భువనగిరి ఎంపీ టికెట్ బీసీకి ఇస్తే బాగుంటుందన్నారు. మా అన్నదమ్ముళ్లను విడదీసే కుట్ర జరుగుతోందని కోమటిరెడ్డి బ్రదర్స్ ను విడదీయడం అసాధ్యం అన్నారు. దోచుకున్న సొమ్ముతో సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి గెలిచారని అదే పటేల్ రమేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.