మీ ప్రయత్నాలు సాగవు.. కేటీఆర్ పై కోమటిరెడ్డి విమర్శలు

by samatah |
మీ ప్రయత్నాలు సాగవు.. కేటీఆర్ పై కోమటిరెడ్డి విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇరికిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే తప్పు చేసిన వారెవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అని బీజేపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'కేటీఆర్.. మరకలు తొలగించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేవి ఏవి పని చేయవు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు కవితను పిలవగానే మహిళా బిల్లును తెరపైకి తీసుకువచ్చారు. అలాగే విచారణను అడ్డుకునేందుకు కోర్టులో ప్రయత్నించారు. అక్కడ ఎదురు దెబ్బ తగలడంతో ఇప్పుడు ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవేవి పనిచేయవు అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story