- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు PM Modi తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
దిశ, వెబ్ డెస్క్:ప్రధాని నరేంద్ర మోడీతో భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రేపు(శుక్రవారం) భేటీ కానున్నారు.అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి కోరగా రేపు ఉదయం 11 గంటలకు రావాలని పీఎంవో నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై భేటీలో చర్చించనున్నారు. మూసీ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతున్నా నల్గొండలో పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎంపీ ప్రధానిని కోరనున్నట్లు తెలిసింది. మెట్రో, ఎంఎంటీఎస్ కు సంబంధించి పలు అంశాలపై ప్రధానితో కోమటిరెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్- విజయవాడ హైవే గురించి ప్రధాని దృష్టికి పలు అంశాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని బుధవారం కోమటిరెడ్డి కలిసారు. అనంతరం ఒక్క రోజు వ్యవధిలో ప్రధానిని కలవనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read...