Komatireddy Venkat Reddy కి ఖర్గే కీలక పదవి ఆఫర్

by Nagaya |   ( Updated:2022-12-14 09:00:54.0  )
Komatireddy Venkat Reddy కి ఖర్గే కీలక పదవి ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఖర్గేను కలిసిన వెంకట్ రెడ్డి అరగంట పాటు రాష్ట్రంలోని పార్టీ కార్యకలాపాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీనియర్లు పార్టీని వీడడంపై వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఖర్గేతో చర్చించినట్లు సమాచారం. టీపీసీసీ కమిటీల నియామకంలో కొందరు సీనియర్లకు చోటు దక్కని విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖర్గేకు వివరించారని సమాచారం. కమిటీల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు.

మరోవైపు, తమ్ముడు పార్టీ మారిన.. వెంకట్ రెడ్డి పార్టీ మారకుండా పని చేస్తున్నందుకు ఖర్గే మెచ్చుకున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో వెంకట్ రెడ్డికి ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ స్థాయిలో వెంకట్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తానంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఢిల్లీ వెళ్లిన వెంకట్ రెడ్డి వరుసగా ఏఐసీసీ నేతలను కలుస్తున్నారు. మంగళవారం రాత్రి తారీక్ అన్వర్‌ను కలిసి షోకాజ్ నోటీసులపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఇటీవల టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 84 మంది ప్రధాన కార్యదర్శులు, 24 మంది ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే, ఇందులో వెంకట్ రెడ్డికి చోటు కల్పించకపోవడంపై ఖర్గే వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో, దాదాపు 30 ఏళ్లుగా సుదీర్ఘ సేవలను అందించిన వెంకట్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో చోటు దక్కకపోయినా జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తానని ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read....

'ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉందని దేశమంతా తెలుసు!'

Advertisement

Next Story

Most Viewed