75 నుండి 80 సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్: Komatireddy Venkat Reddy కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-26 16:16:29.0  )
75 నుండి 80 సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్: Komatireddy Venkat Reddy కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని.. అందులో భాగంగానే వారానికి ఓ సారి మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని టీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. టీ కాంగ్రెస్ నేతలతో కలిసి సోమవారం రాహుల్ గాంధీతో సమావేశం అయిన వెంకట్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు నూటికి నూరు శాతం ఒక్కటే అని.. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వాన్ని వదిలేసి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని కానీ ఆ కేసు ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని 75 నుండి 80 సీట్ల మధ్య కాంగ్రెస్‌కు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రేపు స్ట్రాటజిక్ కమిటీ మీటింగ్‌లో చర్చిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి :


బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటి సంచలన ప్రకటన

సుతి లేని బీజేపీ.. మతి లేని కాంగ్రెస్: మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

Next Story