- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము తలుచుకుంటే 24 గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే 24 గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, ఆ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు మాత్రమే మిగులుతారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నాళ్ల పాటే మనుగడ సాధిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటకే తమతో టచ్ లో ఉన్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే మిగిలి మిగతా 36 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారన్నారు. కానీ తాము అలాంటి దుర్మార్గమైన అలోచన చేయడం లేదన్నారు. ఎవరైనా ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరాలనుకునే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం, సీఎం చర్చించి ఒక పాలసీ నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో మా ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చూశామని ఇప్పుడు మా తడాఖ ఏంటో చూపిస్తామన్నారు.