- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR దవాఖానకు.. కారు కార్ఖానాకు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారి జేబుల్లో కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని తిరుగుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం పోచంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దవాఖానకు.. కారు కార్ఖానాకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ కతం అయింది అన్నారు. హరీష్ రావుకు ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు.దళితున్ని ముఖ్యమంత్రి చేయకుంటే మీ మామ కేసీఆర్ తల నరుక్కుంటాను అన్నాడని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఎటుపాయే అని ప్రశ్నించారు.
2009లో తనను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని, 2019లో అన్న వెంకట్ రెడ్డిని గెలిపించారని, 2024లో తన తమ్ముడు చదువుకున్న వ్యక్తి, యువ నాయకుడు, గత 20 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన సేవకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీమనపల్లి చెరువు తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేశానని, 2012 లో కరువు వచ్చి పశువులకు పశుగ్రాసం లేక తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే తన సొంత ఖర్చుతో అందించినట్లు తెలిపారు. తాను రైతు బిడ్డగా చెబుతున్నానని గోదావరి జలాలతో బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా పోచంపల్లి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. పేద మహిళలను యువకులను రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటామన్నారు. రాజకీయాలు మానవత్వంతో చేయాలని, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టకూడదన్నారు. అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కవిత తీహార్ జైల్లో ఉంది కేసీఆర్, కేటీఆర్ కూడా త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. 10 సంవత్సరాలు అబద్దాలతో మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేశాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు.